Home » Guntur
అప్పులు ఎగొట్టేందుకు ఓ మహిళల ముఠా మాస్టర్ స్కెచ్ వేసింది. సైనైడ్ ఉపయోగించి వరుస హత్యలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. మహిళల ముఠా చాకచక్యంగా హత్యలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు.
వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ తప్పిదాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.
అమరావతి (మంగళగిరి టౌన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతోంది.
గుంటూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కొన్ని చోట్ల బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షాలపై మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన వన మహోత్సవం ఉమ్మడి జిల్లాలో కోలాహలంగా జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని ఎకో పార్కులో ప్రారంభించారు. మొక్కలు నాటి స్థానిక ప్రజలతో మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మొక్కలు నాటారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అసలు వన మహోత్సవ కార్య క్రమం సీఎం నరసరావుపేటలో ప్రారం భించాల్సి ఉంది. స్థానిక అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. అయితే శుక్రవారం వర్షం కారణంగా, అక్కడ కార్య క్రమాన్ని రద్దు చేసి, మంగ ళగిరిలో నిర్వ హిం చడం గమనార్హం.
ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు.
గడచిన వారం రోజులుగా వేసవిని తలపించేలా కాస్తున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.