Share News

Guntur: గుంటూరు జైలు వద్ద హైడ్రామా.. రెచ్చినపోయిన అంబటి రాంబాబు అనుచరులు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:50 PM

పోసాని కృష్ణమురళీని కలిసేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు, ఆ పార్టీ శ్రేణులు గుంటూరు జైలు వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు జైలు వద్దకు వచ్చాడు.

Guntur: గుంటూరు జైలు వద్ద హైడ్రామా.. రెచ్చినపోయిన అంబటి రాంబాబు అనుచరులు..
YSRCP Leader Ambati Rambabu

గుంటూరు: గుంటూరు జిల్లా జైలు(Guntur Jail) వద్ద వైసీపీ నేతలు (YSRCP Leaders) హల్ చల్ చేస్తున్నారు. జైలు వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు సిద్ధం అవ్వగా అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని (Posani Krishna Murali) కృష్ణమురళీ ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు.


అయితే పోసానిని కలిసేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు, ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు జైలు వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా అంబటిని చూసిన సదరు వ్యక్తి ఆయన్ని నిలదీశాడు. వైసీపీ హయాంలో కాపు కులస్థులకు ఏం చేశావంటూ అంబటిని ప్రశ్నించాడు. ములాఖత్‍కు వెళ్తున్న అంబటిని ఆపి మరీ గట్టిగా నిలదీశాడు యువకుడు. అయితే పొంతన లేని సమాధానాలు చెప్తూనే అంబటి ములాఖత్ కోసం జైలు లోపలికి వెళ్లారు. మరోవైపు ఆ యువకుడు కూడా జైలు లోపలికి వెళ్లాడు.


అంబటి రాంబాబు సమాచారం మేరకు వైసీపీ అల్లరి మూకలు జైలు వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. మా నేతను ప్రశ్నించే దమ్ము ఇక్కడ ఎవరికి ఉందంటూ నినాదాలు చేశారు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ అక్కడంతా హంగామా సృష్టించారు. అంబటిని ప్రశ్నించిన యువకుడు జైలు నుంచి బయటకు రాగానే దాడి చేసేందుకు కుట్రలు పన్నారు. అయితే వారు దాడి చేస్తారని సమాచారం అందుకున్న పోలీసులు.. జైలు వద్ద భారీగా మోహరించారు. వైసీపీ మూకలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడంతా భయానక వాతావరణం ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..

Updated Date - Mar 13 , 2025 | 05:57 PM