Home » Hamas
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతిచెందాడు.
పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్ అత్యంత దుర్బేధ్యమైనది. పైన ఆరు అంతస్తుల భవనం ఉండగా.. భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్ ఉంది.
హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ శనివారం ముప్పేట దాడులు చేసింది.
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్ హత్యలు ఇజ్రాయెల్ పనేనని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల హిజ్బుల్లా గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్‌సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
గాజా తూర్పు ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఓ పాఠశాల భవనంలో ఉన్న పాలస్తీనీయులపై దాడికి తెగబడ్డాయి. దాంతో వంద మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రార్థనలు చేసే సమయంలో దాడి జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత వారం కూడా గాజాలో గల నాలుగు పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.