Share News

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:38 AM

ఇజ్రాయెల్‌ గాజాలో చేపట్టిన తాజా దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియా శరణార్ధి శిబిరం మరియు ఖాన్‌ యూనిస్‌ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది

Gaza Under Attack: గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో 57 మంది మృతి

జెరుసలెమ్‌, ఏప్రిల్‌2: గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన తాజా దాడుల్లో 57 మంది మృతి చెందారు. జబాలియా శరణార్ధి శిబిరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్‌పై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడుల్లో పలువురు చిన్నారులు సహా 22 మందికిపైగా చనిపోయారు. ఖాన్‌ యూని‌స్‌లోని ఓ భవనంపై జరిపిన దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారు. గాజాలో ఇప్పటికే బఫర్‌ జోన్‌ కింద కొంత భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇజ్రాయెల్‌ మరింత భూభాగం కోసం యత్నిస్తోంది. ఇప్పటికే రఫాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేసింది. బెయిట్‌ హనూన్‌, లహియా ప్రాంతాలను కూడా వదిలి వెళ్లాలని స్థానికులకు సూచించింది. హమా్‌సను బహిష్కరించి వారి వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టడమే.. దాడులు ఆపేందుకు ఏకైక మార్గమని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ గాజా వాసులకు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 03:38 AM