Home » Harry Brook
ఆశలు వదిలేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ ఆఖరి నిమిషంలో ఊపిరిలూదాడు. తన రికార్డ్ బ్రేక్ సెంచరీతో జట్టును విజయతీరాలకు నడిపించాడు..
ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. గతేడాది వేలంలో ఏకంగా రూ. 13.23 కోట్లు వెచ్చించి బ్రూక్‌ను సన్‌రైజర్స్ కొనుక్కుంది.
ప్రపంచంలోనే మూడు లీగ్‌లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ రికార్డు కైవసం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్‌లలో హ్యారీ బ్రూక్ శతకం సాధించాడు.
13, 3, 13.. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ స్కోర్లివి. రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసినా జట్టుకు భారంగా మారిన ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.. ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ఇదిగో నా సత్తా అంటూ ఏకంగా అజేయ శతకంతో అదరగొట్టాడు.
విమర్శలు పటాపంచలయ్యాయి. రూ. 13.25 కోట్లు పెట్టి కొంటే చేసిది 13, 3, 13 పరుగులేనా?