ENG vs NZ: న్యూజిలాండ్ బౌలర్లపై ఊచకోత.. స్టన్నింగ్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్
ABN , Publish Date - Dec 06 , 2024 | 09:04 AM
ఆశలు వదిలేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ ఆఖరి నిమిషంలో ఊపిరిలూదాడు. తన రికార్డ్ బ్రేక్ సెంచరీతో జట్టును విజయతీరాలకు నడిపించాడు..
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంచలనం హ్యారీ బ్రూక్ ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ ను షేక్ చేస్తూ హ్యారీ బ్రూక్ చేసిన సెంచరీ రికార్డులు క్రియేట్ చేసింది. కివీస్‌పై ఈ సిరీస్‌లో హ్యారీకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో అతడు తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
ఓల్లీ పోప్ తో కలిసి అతడు చేసిన ప్రదర్శన ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చింది. టీబ్రేక్ సమయానికి ఏడు వికెట్లకు 259 పరుగుల స్కోర్‌ను సాధించిన ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై ఆధిక్యంలో ఉంది. రనౌట్ కావడానికి సిద్ధంగా ఉన్న జట్టును రెండో రోజు హ్యారీ తన అద్భుతమైన సెంచరీతో ఆదుకున్నాడు. 4 వికెట్ల నష్టానికి 43 పరుగుల వద్ద కొట్టుమిట్టాడుతున్న ఇంగ్లాండ్ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. ఐదు సిక్సర్లు, 11 ఫోర్లతో 123 పరుగులు చేసి అదరగొట్టాడు. 25 ఏళ్ల ఈ యువ క్రికెటర్ పేరు ఇప్పుడు సంచలనంగా మారింది.