Home » Haryana
హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత సింగ్ మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖేరా, పలువురు మద్దతుదారుల సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానా లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి రానున్నారా? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా నుంచి ఆయన పోటీ చేయనున్నారా? కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలకు సంజయ్ దత్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా జవాబిచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఈ మధ్యే కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు కురుక్షేత్ర నుంచి లోక్ సభ ఎన్నికలకు టికెట్ కేటాయించింది.
హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హిస్సార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. దశాబ్దం పాటు ప్రజలకు సేవా చేశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు.
ఓ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా బాయిలర్ పేలడంతో దాదాపు 100 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన హర్యానాలోని రేవారీ జిల్లాలోని ధరుహేరా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
హరియాణా కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో గెలిచారు. మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఓటింగ్‌కు జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.
హర్యానా రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీతో పాటు మరో అయిదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
పెళ్లిలో వరుడి తీరును గమనిస్తున్న వధువుకు అనుమానం మొదలైంది. ఆ తరువాత అతడి కంట కన్నీరు చూశాక తన అనుమానం నిజమని తేలడంతో పెళ్లి రద్దు చేసుకుంది.