Birender Singh: ఇది 'విచార్ వాపస్'.. కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్
ABN , Publish Date - Apr 09 , 2024 | 03:31 PM
హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత సింగ్ మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖేరా, పలువురు మద్దతుదారుల సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
న్యూఢిల్లీ: హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ (Chaudhry Birender Singh), ఆయన భార్య ప్రేమలత సింగ్ (Premlata Singh) మంగళవారంనాడు కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖేరా, పలువురు మద్దతుదారుల సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా బీరేందర్ సింగ్ మాట్లాడుతూ, హర్యానా రాజకీయాల్లో ప్రజలతో తాము మమేకమ్యయాయమని, ప్రజలు కూడా తమకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఈరోజు పార్టీలోకి తిరిగి రావడం సొంతింటికి తిరిగి రావడం (Ghar Wapsi) మాత్రమే కాదని, సిద్ధాంతాల పునరాగమనమని (Vichar Wapsi) అని చెప్పారు. ''నేను కాంగ్రెస్ నుంచి లీవ్ తీసుకున్నారు. అందుకు సోనియాగాంధీకి క్షమాపణ తెలియజేశాను. కొన్ని కారణాల వల్ల నేను బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆమెకు వివరించాను'' అని తెలిపారు.
Rajiv Kumar: సీఈసీ రాజీవ్‌కుమార్‌కు 'జడ్' కేటగిరి భద్రత
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని తొలి ప్రభుత్వంలో బీరేందర్ సింగ్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రద్దయిన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఆందోళనలకు బీరేందర్ సింగ్ మద్దతు పలికారు. నెలరోజుల క్రితం బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. 2014-2019 మధ్య బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బీరేందర్ భార్య ప్రేమ్‌లత సైతం పార్టీని వీడారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉన్న బీరేందర్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. కాగా, బీజేపీకి రాజీనామా చేశానని, తన రాజీనామాను జేపీ నడ్డాకు అందజేశానని బీరేందర్ సింగ్ సోమవారం ప్రకటించారు. తాను, తన భార్య కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కూడా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..