Explodes: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. 100 మంది కార్మికులకు గాయాలు!
ABN , Publish Date - Mar 17 , 2024 | 07:05 AM
ఓ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా బాయిలర్ పేలడంతో దాదాపు 100 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన హర్యానాలోని రేవారీ జిల్లాలోని ధరుహేరా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
ఓ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా బాయిలర్ పేలడం(Explodes)తో దాదాపు 100 మంది కార్మికులు(100 Factory Workers) గాయపడ్డారు. ఈ ఘటన హర్యానా(Haryana)లోని రేవారీ జిల్లాలోని ధరుహేరా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ట్రామా కేంద్రంలోని వైద్యులను అప్రమత్తం చేశామని, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారిని రోహ్‌తక్‌కు రిఫర్ చేస్తున్నామని, ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారులు(officers) వెల్లడించారు. 'లైఫ్-లాంగ్ ఫ్యాక్టరీ'లో ఈ పేలుడు సంభవించగా, పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Amit Shah : ఎన్నికల బాండ్ల రద్దు కంటే మెరుగుపరిస్తే బాగుండేది