Home » Heavy Rains
Andhrapradesh: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలన్నా వరద నీటితో ఆటంకాలే. చివరకు అంతిమ యాత్రకు కూడా వరద కష్టాలు ఎదురయ్యాయి.
Andhrapradesh: ఏపీని వర్షాలు వీడటం లేదు. మొన్నటి వరకు విజయవాడలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు వర్షాల నుంచి కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన కాజ్ వే లు కొట్టకుపోయాయి.
శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వణికించాడు..! గత వారం నాటి అనుభవం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు..!
ఏలేరు జలాశయానికి ఇన్ ఫ్లో వేగంగా పెరుగుతోంది. ప్రమాదకర స్థాయికి నీటిమట్టం చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం కాగా 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.24 టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది.
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకు వరద పోటు వచ్చిందనీ ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయని చెప్పారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో బుడమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.