Share News

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:37 AM

Andhrapradesh: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలన్నా వరద నీటితో ఆటంకాలే. చివరకు అంతిమ యాత్రకు కూడా వరద కష్టాలు ఎదురయ్యాయి.

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు
Alluri Dirstrict Flood

అల్లూరి జిల్లా, సెప్టెంబర్ 9: ఏపీలో (Andhrapradesh) వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. బయటకు వెళ్లాలన్నా వరద నీటితో ఆటంకాలే. చివరకు అంతిమ యాత్రకు కూడా వరద కష్టాలు ఎదురయ్యాయి. గిరిజన గ్రామంలో అంతిమయాత్రకు వరద కష్టాలు తప్పడం లేదు.

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన... సంచలన ఆరోపణలు చేసిన తల్లిదండ్రులు


అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ తముటు గ్రామంలో చిన్నయ్య 60 అనే గిరిజనుడు మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించేందుకు గ్రామం పక్కనున్న గెడ్డను దాటాల్సిన పరిస్థితి. అయితే రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చిన్నయ్య అంతిమయాత్ర జరిపేందుకు వీలులేకుండా పోయింది. గెడ్డలో నీటి ప్రవాహం తగ్గుతాదని ఒకరోజు పాటు మృతదేహాన్ని ఇంటి దగ్గర ఉంచి మరీ గిరిజన ప్రజలు వేచి చూశారు.

ఉత్తరకోస్తాకు వాయు‘గండం’



అయితే వర్షం ఏకధాటిగా కురవడంతో ఫలితం లేకుండా పోయింది. చివరకు గెడ్డకు ఇరువైపులా చెట్లకు తాళ్ళను కట్టుకొని మృతదేహాన్ని గిరిజనులు తరలించారు. ‘‘ మాకు కష్టం వచ్చినా, బాధొచ్చిన, చావొచ్చిన గెడ్డ దాటాల్సిన పరిస్థితి ఉంది’’ అంటూ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గెడ్డపై బ్రిడ్జిని నిర్మించి సంబంధిత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని ఆయా గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: కూతురు తలపై సీసీ కెమెరా.. కారణమిదేనట..!

Heavy Rains: చింతపల్లి - నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 09 , 2024 | 10:49 AM