Home » High Court
హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటోందని, కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ శనివారం పలు విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ముందుకు వెళ్లకుండా యథాతథ స్థితి(స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆ కన్వెన్షన్ మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసిందని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మార్కింగ్ కూడా ఇచ్చిందని తెలిపారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
థానే జిల్లా బద్లాపూర్ లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు అడ్డుకట్టు వేసింది. బంద్ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది.
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫాంహౌజ్ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ (హైడ్రా)ను హైకోర్టు ఆదేశించింది.
జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతను రేపటి(గురువారం) వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) స్పష్టం చేసింది. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.