RG Kar Hospital: హత్యాచారం కేసులో సీబీఐ కీలక పురోగతి
ABN , Publish Date - Aug 22 , 2024 | 08:34 PM
ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కత్తా, ఆగస్ట్ 22: ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు డాక్టర్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టును సీబీఐ అనుమతి కోరింది. సీబీఐ అభ్యర్థన పట్ల కోల్‌కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Also Read: Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ట్రైయినీ వైద్యురాలి మృతి చెందిన అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై సీబీఐ సందేహాలు వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఘటన అనంతరం ఆయన పలువురని సంప్రదించినట్లు సమాచారం. అలాగే బాధితురాలి తల్లిదండ్రులను ఆమె మృతదేహాన్ని చూడడానికి అనుమతించడంలో ఆయన తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించారని తెలుస్తుంది. కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు వారు ఆసుపత్రి వద్ద దాదాపు 3 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఓ ప్రచారం సైతం సాగింది.
Also Read: Hyderabad City: నడి రోడ్డుపై యువకుడి నిర్వాకం.. ఏం చేశాడంటే..?
Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’
అందుకు గల కారణాలేమిటంటూ డాక్టర్ సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నలు సంధించింది. ఆ క్రమంలో ఆయనతోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. హత్యాచార ఘటన అనంతరం దీనిని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే సీబీఐ ఆరోపించిన విషయం విధితమే.
Also Read: Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’
Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
అదీకాక.. ఈ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో పదవిలో నియమించింది. ఈ ఘటనపై ఆయన స్పందించారు. మృతురాలు తన కుమార్తె వంటిదని ఆయన అభివర్ణించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఎక్స్ వేదికగా ప్రొ. సందీప్ ఘోష్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.
Read More Telangana News and atest Telugu News