Home » High Court
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-6గా ఉన్న జర్నలిస్టు శ్రవణ్ కుమార్ ఏ తప్పూ చేయకపోతే అర్ధరాత్రి విదేశాలకు ఎందుకు పారిపోయారని ప్రభుత్వం ప్రశ్నించింది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాలో దాక్కున్నారని ఆరోపించింది.
సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని 3,532 చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటిలో ఆక్రమణల తొలగింపు, ఎన్ని చెరువులకు హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేశారనే అంశాలపై స్థాయీ నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కల్తీ, మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒకే వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది.
ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
నేర న్యాయ వ్యవస్థలో ‘నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలకా్ట్రనిక్ ప్రాసెసెస్ (ఎన్‌స్టె్‌ప)’ అమలుతో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయం (రీజనబుల్ టైం)లో తప్పకుండా నిర్ణయం తీసుకొని, తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీజనబుల్ టైం అంటే ఎప్పుడు అనే దానికి సంబంధించి మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్ నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువ చేసే భూమి. పైగా మధ్యతరగతికి చెందినవారి చేతిలో ఉంది. ఇంకేం..! భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగాహిల్స్ వెంచర్ విషయంలో ఇదే జరిగింది.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మధ్యవర్తిత్వానికి(మీడియేషన్) వివాదంలో ఉన్న పక్షాలు పెద్ద పీట వేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ సూచించారు.