Home » Hyderabad
Telangana: శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీపై బీఆర్ఎస్ మేడ్చజ్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వాఖ్యలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు.
మల్లారెడ్డి ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా, నారాయణపేట్(Narayanpet) మండలం, సాతూరుపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు భార్య రాగి చిన్నవలోల్ల లక్ష్మి (48)ను అనారోగ్యంతో ఆగస్టు 31న సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాటుపై పోలీసులు దాడిచేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రమంజిల్ నుంచి తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లే మార్గంలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో వ్యభిచారం నడుస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలులకు నగరవాసులు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది.
సినీనటుడు రామ్‌చరణ్(Film actor Ram Charan) అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక (అయ్యప్ప జేఏసీ) ఆరోపించింది. దీక్షలో ఉండి మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి ప్రశ్నించారు.
కారు దగ్ధం ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల(Electric cars)లో బ్యాటరీ పేలడం వల్లనో, పెట్రోలు, డీజిల్ కార్లు వేడెక్కడం వల్లనో కొన్ని ఘటనలు జరిగినా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారీ జోరుగా సాగుతోంది. పరిమిత స్థాయిలో అల్లం, వెల్లుల్లి వాడుతూ సింథటిక్ రంగులు, సిట్రిక్ యాసిడ్, ఇతరత్రా పదార్థాలను ఈ మిశ్రమంలో కలుపుతున్నారు. కాటేదాన్(Katedan)లో తెలంగాణ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలి బి.అనిల్‌యాదవ్(42) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.