Hyderabad: కార్లలో మంటల వెనుక.. తీగల ట్యాంపరింగే కారణం..
ABN , Publish Date - Nov 21 , 2024 | 07:44 AM
కారు దగ్ధం ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల(Electric cars)లో బ్యాటరీ పేలడం వల్లనో, పెట్రోలు, డీజిల్ కార్లు వేడెక్కడం వల్లనో కొన్ని ఘటనలు జరిగినా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
- అదనపు హంగుల పేరిట ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు..
- విద్యుత్ కార్లతో పోల్చితే హైబ్రిడ్ కార్లలోనే ఎక్కువ ప్రమాదాలు
హైదరాబాద్ సిటీ: కారు దగ్ధం ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల(Electric cars)లో బ్యాటరీ పేలడం వల్లనో, పెట్రోలు, డీజిల్ కార్లు వేడెక్కడం వల్లనో కొన్ని ఘటనలు జరిగినా.. ఆ తర్వాత ఊహించని కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడానికి గల కారణాలను పరిశీలిస్తే.. విద్యుత్ కార్లకంటే హైబ్రిడ్ కార్లే ఎక్కువగా అగ్నిప్రమాదాల బారిన పడుతున్నాయని బీమా కంపెనీల అధ్యయనాలు చెబుతున్నాయి. కారులో విద్యుత్ తీగలపై అధికంగా ఒత్తిడి పడడమే దీనికి కారణమని వెలుగు చూసింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం సీజ్
కారులో యంత్రం, విద్యుత్ విడిభాగాలతోపాటు క్లిష్టమైన విద్యుత్ వైరింగ్ కూడా ఉంటుంది. నిప్పురవ్వ తగలగానే అంటుకునే ఆయిల్స్ ఉంటాయి. అందువల్ల కార్లలో అగ్నిప్రమాదాలు జరిగేందుకు అవకాశాలెక్కువ. నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం జరిగితే ప్రమాద తీవ్రత వేగంగా జరగడమే కాకుండా పూర్తి కాలిపోయే అవకాశాలే ఎక్కువ. ఒక్కోసారి ప్రాణాలుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్‌సర్క్యూట్ లేదా కారు వైరింగ్‌లో లోపాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కార్ల దగ్ధం వెనుక కారణాలపై యూసఫ్‌గూడ(Yusuf guda)కు చెందిన సుుజుకీ మోటార్స్ మెకానిక్ హరీశ్ మాట్లాడుతూ.. విద్యుత్ తీగలను ట్యాంపర్ చేయడం వల్లనే ప్రధానంగా సమస్యలు వస్తాయని తెలిపారు. కార్లతో వచ్చే యాక్సెసరీలు కాకుండా అదనపు హంగులు చేయడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని బొల్లారంలోని సన్‌రైజ్ కార్‌కేర్ సెంటర్ అధినేత రామరాజు చెప్పారు.
ఫ్యూజులు కాలిపోయి..
సాధారణంగా కార్లు దగ్ధం అవడానికి ముందు ఫ్యూజులు కాలిపోతాయి. కారులో వేడి ఎక్కువవుతుంది. కారు ఇంజన్ వద్ద, లేదా కింది భాగంలో మంట మొదలవుతుంది. కారు ఎగ్జాస్ట్ శబ్దం ఎక్కువవుతంది. మంటలు చెలరేగితే వేడికి టైర్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. కూలెంట్ లీక్ అయినా ఇంజిన్ వేడెక్కుతుంది. విద్యుత్ తీగలు కాలిన వాసన మొదలవుతుంది. ఇలా ఏ కారణం కనిపించినా వెంటనే అప్రమత్తమవ్వాలి.
ప్రమాదాల నివారణ ఇలా..
- కారును క్రమం తప్పకుండా సర్వీస్ చేయించాలి.
- బ్రేక్ ఆయిల్స్, బ్యాటరీలో యాసిడ్స్ సహా అన్నీ సక్రమంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వైరింగ్ కూడా పరీక్ష చేయించాలి.
- పెట్రోల్ లీకేజ్ సహా, ఇంజిన్ ఆయిల్ లేదంటే కూలెంట్ లాంటివి లీకేజీ లేకుండా తనిఖీ చేయించాలి.
- డ్రైవర్ సీటు దగ్గర మంటలార్పే సిలిండర్‌ను ఉంచుకోవాలి.
- కారు లోపల సిగిరెట్ కాల్చకూడదు.
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్ గడువు..22 వరకు ఎడిట్ ఆప్షన్
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..
Read Latest Telangana News and National News