Share News

Hyderabad: అమ్మో ఈగం.. పటాన్‌చెరులో అత్యల్పంగా 12.2 డిగ్రీలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 08:58 AM

హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలులకు నగరవాసులు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది.

Hyderabad: అమ్మో ఈగం.. పటాన్‌చెరులో అత్యల్పంగా 12.2 డిగ్రీలు

- ఇవే ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజులు

- వాతావరణ శాఖ అధికారుల వెల్లడి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలులకు నగరవాసులు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. చలి తీవ్రత మరో ఐదురోజుల పాటు కొనసాగుతుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం పటాన్‌చెరు(Patancheru)లో అత్యల్పంగా 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, రాజేంద్రనగర్‌లో 13 డిగ్రీలు,

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యప్ప మాలతో దర్గాకు ఎలా వెళతారు.. రామ్‌చరణ్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి


city5.2.jpg

హయత్‌నగర్‌లో 14.6, బేగంపేటలో 15.1, దుండిగల్‌, హకీంపేట(Dundigal, Hakimpeta) ప్రాంతాల్లో 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితలగాలులు తూర్పు, ఈశాన్య దిశగా గంటకు 4-8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌(Hyderabad)లో గరిష్టం - 29.2, కనిష్టం 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 062 శాతంగా నమోదయింది.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 08:58 AM