Home » HYDRA
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.
కూకట్పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేసినట్లు తెలిపారు. నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట, పటేల్ గూడలో కూల్చివేసినట్లు చెప్పారు.
భాగ్యనగరం హైదరాబాద్లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్పల్లి, అమీన్పూర్లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
హైడ్రా.. సంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా బృందం శనివారం పరిశీలించింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది.
Telangana: జలవిహార్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జలవిహార్ డైరెక్టర్ విజయ్ ఆదిత్య రాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని.. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Telangana: హైడ్రాకు సంబంధిం సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్లో మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఉన్న విశేష అధికారాలు హైడ్రాకు ఇవ్వడంపై కేబినెట్ చర్చించునుంది.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆపరేషన్ వేగం పుంజుకోనుంది.
చెరువులు, కుంటల సంరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి పంపింది.