Home » HYDRA
HYDRA Demolition: హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గచ్చిబౌలిలో భారీ కమర్షియల్ షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
హైదరాబాద్ హైడ్రా సంస్థకు కొత్త లోగోను ఆవిష్కరించారు. హెచ్ ఆకారంలో నీటి చుక్కతో నగర విశిష్టతను ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు.
HYDRA New Logo: కొత్త లోగోను విడుదల చేసింది హైడ్రా. ఇకపై నూతన లోగోతోనే హైడ్రా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ‘ప్రజావాణి’లో వచ్చిన ప్రతి పిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
హఫీజ్‌పేట, రాయదుర్గంలో ప్రభుత్వ నిషేధిత భూముల్లో నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. వందల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకొని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసింది
భాగ్యనగరంలో హైడ్రా ఇవాళ మళ్లీ తన జులుం విదిల్చింది. హైదరాబాద్ రాయదుర్గం వద్ద సర్వే నెంబర్ 5/2 లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూల్చి వేతలు చేపట్టింది.
హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా మళ్లీ యాక్షన్‌లోకి దిగింది. మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అంతేకాకుండా, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తోంది. హైడ్రా అధికారుల పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా పేరుతో తాను వసూళ్లకు పాల్పడుతున్నట్లు అమీన్‌పూర్ సంక్షేమ సంఘం పేరుతో ఒక నకిలీ లేఖ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోందని, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ.ఫహీమ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Faheem Fake Letter Controversy: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్.
ఏ ప్రాంతంలో చెరువు ఉంది..? దాని విస్తీర్ణమెంత..? వరద కాలువలు, నాలాలు ఎక్కడున్నాయి..? వంటి వివరాలతోపాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమస్త సమాచారం ఒక్క క్లిక్‌తో ప్రజలు తెలుసుకునేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.