ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:58 AM
ఏ ప్రాంతంలో చెరువు ఉంది..? దాని విస్తీర్ణమెంత..? వరద కాలువలు, నాలాలు ఎక్కడున్నాయి..? వంటి వివరాలతోపాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమస్త సమాచారం ఒక్క క్లిక్‌తో ప్రజలు తెలుసుకునేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది.

చెరువులు, ప్రభుత్వ భూముల పరిధుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో..
ఓఆర్‌ఆర్ లోపల ఆస్తుల పరిరక్షణకు ఎన్‌ఆర్‌ఎ్‌ససీతో హైడ్రా ఒప్పందం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రాంతంలో చెరువు ఉంది..? దాని విస్తీర్ణమెంత..? వరద కాలువలు, నాలాలు ఎక్కడున్నాయి..? వంటి వివరాలతోపాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమస్త సమాచారం ఒక్క క్లిక్‌తో ప్రజలు తెలుసుకునేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఆయా అంశాలు గుర్తించి.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ఆస్తుల పరిరక్షణ, మెరుగ్గా విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టేందుకు ఎన్‌ఆర్‌ఎ్‌ససీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ, ప్రజావసర భూముల హద్దులు నిర్ధారించి, సాంకేతికంగా అందుబాటులోకి తెస్తే మున్ముందు ఆక్రమణలకు అవకాశముండదని రంగనాథ్ చెప్పారు. ఎవరైనా కబ్జా చేసినా.. ఎన్‌ఆర్‌ఎ్‌ససీ శాటిలైట్ చిత్రాల ద్వారా సులువుగా గుర్తించవచ్చన్నారు. 1970లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపోషీట్లు, కెడస్ట్రల్ మ్యాపులు, రెవెన్యూ రికార్డులు, చెరువుల సమాచారంతో పాటు.. ఎన్‌ఆర్‌ఎ్‌ససీ చిత్రాలతో సమగ్ర సమాచార వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, పర్యావరణహిత నగరం రూపకల్పనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలస్తుందని ప్రకాశ్ చౌహాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు