Home » IAS
వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్ శ్యారమ్‌పసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.
అపార్ట్మెంట్లో డోర్ టు డోర్ తిరగకుండా ఒకేచోట డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరమవుతుందని, అందుకోసం అపార్ట్మెంట్ అసోసియేషన్లను సంప్రదించి బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు.
నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..
దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చిన్నస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారులు వరకూ భారీగా బదిలీలు జరిగిపోతున్నాయి.. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కూడా ఉన్నాయి. తాజాగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.