Share News

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

ABN , Publish Date - Dec 07 , 2024 | 07:54 PM

పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

Pooja Singhal: 28 నెలల తర్వాత జైలు నుంచి పూజా సింఘాల్ విడుదల

న్యూఢిల్లీ: కటకటాల వెనుక 28 నెలలు గడిపిన జార్ఖాండ్ సస్పెండెడ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ (Puja Singhal) ఎట్టకేలకు బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టు ఆమెకు శనివారంనాడు బెయిలు మంజూరు చేసింది.

Lawrence Bishnoi: జైలులోంచి ఎలా బెదిరిస్తాను: లారెన్స్ బిష్ణోయ్


పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఇటీవల ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనలు సైతం విని తీర్పును రిజర్వ్ చేసింది.


పీఎంఎల్ఏ కొత్త నిబంధనల ప్రకారం, దోషిగా తేలితే విధించే శిక్షాకాలంలో మూడు వంతులు జ్యుడిషియల్ కస్టడీలోనే గడపితే సదరు వ్యక్తి బెయిలు పొందేందుకు అర్హత ఉంటుంది. పూజా సింఘాల్ 28 నెలల సుదీర్ఘ కాలం జ్యుడిషియల్ కస్టడీలో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఐఏఎస్ 2000 బ్యాచ్‌కు చెందిన పూజా సింఘాల్ గనుల శాఖ కార్యదర్శిగా, వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తన అధికార కార్యాలయాలను దుర్వినియోగంచేసి అన్యాయార్జితం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఆమె సస్పెండ్ అయ్యారు.


ఇవి కూడా చదవండి...

Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 07:54 PM