Home » Ibrahimpatnam
భారీ వర్షాలకు బెజవాడ వణికిపోయింది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన జనాలు ఎంతో మంది ఉంటే.. నీళ్లు, అన్నం పెట్టి కాపాడంటూ మహాప్రభో అంటూ ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో టిఫిన్లు, భోజనాలు లేక వరద బాధితులు అల్లాడుతున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన సీఎం నారా చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి..
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్‌లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ పార్టీ(Liquor Party) స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు సెలబ్రెటీలు పట్టుబడ్డారు.
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాళ్ల వర్షం కురిసింది.