NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:35 PM
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
విజయవాడ: ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్(NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. విషయం తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి బాధితులను పరామర్శించారు.
ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి..
ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉందని, వారి కుటుంబాలు అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రమాదవశాత్తూ ఎలాంటి ఘటనలు జరిగినా.. సీఎం చంద్రబాబు అండగా ఉంటారని వాసంశెట్టి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలు ఎప్పటికప్పుడు బాయిలర్లను తనిఖీ చేయాలని, కార్మికుల ప్రాణాలను కాపాడే బాధ్యత యాజమాన్యాలదే అని స్పష్టం చేశారు.
Crime News: కూతురు పుట్టిన గంటల వ్యవధిలోనే తండ్రి హత్య.. మరీ ఇంత దారుణమా?
గత ఐదేళ్ల బూడిద దోపిడీపై విచారణ చేస్తాం..
ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం అని దేవినేని విరుచుకుపడ్డారు. నట్టు, బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్‌ను గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఐదేళ్లపాటు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీగా చెప్పుకునే వ్యక్తి థర్మల్ పవర్ స్టేషన్ల సీఈ స్థాయి అధికారులను శాసించాడు. క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుని కోట్లు దండుకున్నారు. గత ఐదేళ్లపాటు బూడిద ఎవరు దోచుకుతున్నారో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..
AP Politics: ఫోన్ కాల్‌తో లక్షలు పోగొట్టుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే