Home » IIT Hyderabad
ప్రతీ విద్యార్థి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే ఆలోచనలతోనే ఉంటున్నారని, అందువల్ల ఒత్తిడి ఎక్కువై సరిగా చదవలేక, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్(ఐఐటీ-హెచ్) డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
అమెరికాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పర్యటన సాగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈ రోజు కంది వర్సిటీలో డ్రైవర్ లెస్ కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్ ప్రాంగణంలో నిర్మించారు.