IIT Placements: ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్‌కు దూరమవుతున్న కంపెనీలు.. తగ్గిన ప్యాకేజీలు.. కారణాలివే..
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:28 PM
IIT Placements: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఈ సంత్సరం క్యాంపస్ నియమాకాలు భారీగా తగ్గాయి. అదే మాదిరిగా జాబ్ ప్యాకేజీల్లోనూ తగ్గుదల కనిపించింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

IIT placements data 2025: IIT, NIT, IIIT సాంకేతిక విద్యాలయాల్లో క్యాంపస్ నియామకాలు తగ్గాయి. అలాగే కొన్ని ఐఐఎంలలో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. గత మూడు సంవత్సరాలతో పోల్చితే ఈసారి IIT క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో దాదాపు 10 శాతం తగ్గుదల కనిపించింది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడంపై కృషి చేయాలని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.
23 ఐఐటీలలో తగ్గిన ప్లేస్‌మెంట్స్
2021-22 సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరం, 2023-24 సెషన్ మధ్య 23 IITలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో తగ్గుదల ఉందని పార్లమెంటులో ప్రవేశపెట్టిన పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొంది. అతిపెద్ద ఐఐటీగా పేరొందిన అయిన ఐఐటీ రూర్కీలోనే భారీగా నియామకాలు తగ్గాయి. ఇక్కడ 2021-22 సంవత్సరంలో 98.54 శాతం ఉంటే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 79.66 శాతానికి పడిపోయింది. అంటే దాదాపు 18.88 శాతం తగ్గుదల.
రెండవ స్థానంలో ఐఐటీ ఢిల్లీ ఉంది. 2021-22 సంవత్సరం, 2023-24 సంవత్సరం మధ్య 14.88 శాతం తగ్గుదల ఉంది. ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉంది. 2021-22, 2023-24 సంవత్సరాల మధ్య 12.72 శాతం తగ్గుదల ఉంది. 2021-22 సంవత్సరంలో ఇది 96.11 శాతంగా ఉండగా, 2023-24 మధ్యకాలంలో ఇది 83.39 శాతానికి పడిపోయింది. ఐఐటీ బాంబేలో జీతాల ప్యాకేజీ తగ్గాయి. కరోనా మహమ్మారి తర్వాత నియామకాల్లో తగ్గాయని.. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల దృష్ట్యా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకే దృష్టి పెడుతున్నాయి. కొత్తవారిని తీసుకునేందుకు ఇందుకే ఆసక్తి చూపడం లేదని కమిటీ తెలిపింది. గతంలో లాగా భారీ ప్యాకేజీలు ఇచ్చి ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
తగ్గిన ప్యాకేజీలు.. ఎంతంటే..
ఇంతకుముందు కంటే గత విద్యా సంవత్సరంలో తక్కువ మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్లు పొందారని IIT బాంబే సెప్టెంబర్ 2024 నాటి తన నివేదికలో పేర్కొంది. అత్యల్ప జీతం ప్యాకేజీ సంవత్సరానికి కేవలం రూ.4 లక్షలకు పడిపోయింది. ఈ తగ్గుదల విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది. 2021-22, 2023-24 సంవత్సరాల మధ్య ఐఐటీ మద్రాస్ నియామకాలలో 12.42% తగ్గుదల కనిపించింది. 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో IIT BHUలో నియామకాలు మెరుగుపడ్డాయి, అయితే మునుపటి విద్యా సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరంలో 7.58% తగ్గుదల ఇప్పటికీ ఉంది. ఐఐటీ కాన్పూర్‌లో 11.15% క్షీణత ఉండగా, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అత్యల్పంగా 2.8% క్షీణత ఉంది.
సమస్యల్లో ఈ IITలు
2021-22, 2023-24 విద్యా సంవత్సరాల మధ్య రెండవ, మూడవ తరం IITలలోని అనేక విద్యా సంస్థల్లో నియామకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. 2008, 2009 మధ్య స్థాపించిన ఈ IITలలో IIT హైదరాబాద్ కూడా ఉంది. దీంట్లో అతి తక్కువ క్యాంపస్ నియామకాలు నమోదయ్యాయి. 2021-22లో 86.52 శాతం ఉన్న ప్లేస్‌మెంట్ రేటు 2023-24లో 69.33 శాతానికి పడిపోయింది. ఐఐటీ మండి 14.1 శాతం తగ్గింది. 2015, 2016 మధ్య స్థాపించిన IIT జమ్మూలో 21.83 శాతం తగ్గుదల కనిపించింది.
Read Also: Jobs: ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..చివరి తేదీ ఎప్పుడంటే..
Indian Navy: టెన్త్ క్లాస్ పాసై, ఈత వస్తే చాలు..నెలకు రూ.80 వేల జీతం, ఇప్పుడే అప్లై చేయండి.
CBSE: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు..