Home » Imphal
మణిపూర్లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది.
మణిపుర్(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.
రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.