Manipur:మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇళ్లు తగులబెట్టిన దుండగులు

ABN , First Publish Date - 2023-10-05T16:28:48+05:30 IST

మణిపుర్‌(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.

Manipur:మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇళ్లు తగులబెట్టిన దుండగులు

ఇంఫాల్: మణిపుర్‌(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తాజాగా రాజధాని ఇంఫాల్(Imphal) లో గుర్తు తెలియని దుండగులు ఇళ్లకు నిప్పు అంటించారు. బుధవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ పశ్చిమ జిల్లా పట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ కెయిథెల్ మన్బిలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.


అనంతరం రెండు ఇళ్లకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా బలగాలు(Protection Forces) మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఆ రాష్ట్రంలో కుకేయి, మైతేయి(Kuki - Maithey) తెగల మధ్య రిజర్వేషన్ అంశంలో చెలరేగిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ఇరు వర్గాల ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకింది. అనంతరం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 175 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అదే టైంలో ఓ వర్గం మహిళలపై లైంగిక దాడులు జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు దేశ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హింసను ఆపడంలో విఫలమవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మందలించింది.

Updated Date - 2023-10-05T16:31:54+05:30 IST