Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత
ABN , Publish Date - Nov 11 , 2024 | 06:22 PM
మణిపూర్‌లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇంఫాల్: మణిపూర్ (Manipur)లో కుకీ మిలిటెంట్లు (Kuki insurgent) తెగబడ్డారు. జిరిబామ్ జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సోమవారంనాడు దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్, అసోం రైఫిల్స్ బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడటంతో హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు.
PM Modi: యువతతోనే వికసిత భారత్ కలల సాకారం: మోదీ
మణిపూర్‌లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
రైతులపై మిలిటెంట్ల కాల్పులు..
కాగా, సోమవారం ఉదయం మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న రైతుపై సమీపంలోని హిల్‌టాప్ పొజిషన్ నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైతు గాయపడ్డాడు. వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. కొద్దిసేపు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. గాయపడిన రైతును సమీపంలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
కొండ ప్రాంతాల నుంచి రైతులపై మిలిటెంట్లు కాల్పులు జరపడం వరుసగా ఇది మూడోరోజు. గత శనివారంనాడు బిష్ణుపూర్ జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఒక మహిళపై మిలిటెంట్లు చురాచాంద్‌పూర్ జిల్లా కొండ ప్రాంతాల నుంచి కాల్పులు జరపడంపై ఆమె మరణించింది. ఆదివారంనాడు కూడా ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని సనసబి, సబున్కోక్ ఖునౌ, తంనపోక్పిలో ఇదే తరహా దాడులు జరిగాయి.
ఇవి కూడా చదవండి..
Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు
Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ
For National news And Telugu News