Home » India
న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులకు షాక్ తగిలింది. వీసా ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి 21 మంది విద్యార్ధులను వెనక్కి పంపారు. అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో చేరేందుకు భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.
సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యంగలవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తిపనివారికి, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర శ్రేణి నేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి నాయకత్వం వల్ల భారత దేశం గొప్ప ప్రయోజనం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పాయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు నివాళులర్పించారు.
No Pak Colors On Burj Khalifa For Independence Day ABK
మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోటపై నుంచి ఆయన మాట్లాడారు.
ఆగస్టు 15కేవలం మన భారతదేశానికి మాత్రమే గొప్పరోజు కాదు, మనతోపాటు ఇంకొక 4దేశాలకు ఇది స్వేచ్చను పొందిన రోజు. బానిస సంకెళ్ళను తెంచుకుని విముక్తి పొందినరోజు.
బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైనచోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ చెప్పారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు.
ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, హిందూ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను కెనడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గత ప్రభుత్వాల హయాంలో కొన్ని సైద్ధాంతిక కారణాల వల్ల దేశ ప్రయోజనాలను త్యాగం చేశారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో భారత దేశం ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తోందని, అయితే దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని చెప్పారు.