Pakistan Independence Day: పాపం పాకిస్తాన్.. మరీ ఇంత ఘోర అవమానమా.. దుబాయ్‌లో పరువు గోవిందా!

ABN , First Publish Date - 2023-08-15T15:27:12+05:30 IST

No Pak Colors On Burj Khalifa For Independence Day ABK

Pakistan Independence Day: పాపం పాకిస్తాన్.. మరీ ఇంత ఘోర అవమానమా.. దుబాయ్‌లో పరువు గోవిందా!

దాయాది దేశమైన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. చరిత్రలో కనువినీ ఎరుగని రీతిలో వారి పరువు దుబాయ్‌లో మంటగలిసి పోయింది. భారత్‌కి సమానంగా తమకూ గౌరవం దక్కుతుందని పాకిస్తానీయులు భావిస్తే.. పాపం తల దించుకొని మౌనంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే.. బుర్జ్ ఖలీఫా నిర్మాణం పూర్తైనప్పటి నుంచి దుబాయ్ ఒక ఆనవాయితీని పాటిస్తూ వస్తోంది. ఏదైనా ఒక దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే.. గౌరవ ప్రదర్శనగా ఆ దేశపతాకాన్ని బుర్జ్ ఖలీఫాపై లైట్లతో ప్రదర్శిస్తూ దుబాయ్ వారికి శుభాకాంక్షలు తెలపడమే ఆ ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండాను దుబాయ్ ప్రదర్శించింది.


అయితే.. మన దేశానికి ఒక రోజు ముందు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే పాకిస్తాన్‌కి మాత్రం దుబాయ్‌లో ఆ గౌరవం దక్కలేదు. పాకిస్తాన్ దేశ పతాకాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించలేదు. నిజానికి.. తమ జాతీయ జెండాని ప్రదర్శిస్తారేమోనన్న ఉద్దేశంతో దుబాయ్‌లో ఉంటున్న వందలాది పాకిస్తానీయులు బుర్జ్ ఖలీఫా వద్దకు తరలి వెళ్లారు. తమ జెండాను ప్రదర్శించినప్పుడు.. తమ దేశ నినాదంతో హోరెత్తించాలని భావించారు. కానీ.. వారిని నిరాశపరుస్తూ పాక్ జెండాను బుర్జ్ ఖలీఫాపై ఆవిష్కరించలేదు. దీంతో నిరాశ చెందిన పాకిస్తానీయులు.. దుబాయ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జాతీయ జెండాని ఎందుకు ప్రదర్శించలేదంటూ మండిపడ్డారు. అంతేకాదు.. ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ గట్టిగట్టిగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో తీసిన ఓ మహిళ అందులో మాట్లాడుతూ.. ‘‘సమయం 12:01 గంటలైనా.. పాకిస్తాన్ జెండాను బుర్జ్ ఖలీఫాపై ఆవిష్కరించలేదు. ఇదీ.. మా దుస్థితి. ఇప్పుడిది మాకు పరువు సమస్యగా మారింది. ఇక్కడున్న పాకిస్తానీయులు నినాదాలు చేస్తున్నా.. జాతీయ జెండాను ప్రదర్శించట్లేదు. పాకిస్తానీయులతో ప్రాంక్ జరిగింది’’ అంటూ పేర్కొంది. మరోవైపు.. అక్కడున్న పాక్ దేశస్థులు ‘ఇది పాకిస్తాన్ దేశాన్ని అవమానించడమే’నంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ.. బుర్జ్ ఖలీఫాపై పాక్ జెండాను ఎందుకు ఆవిష్కరించలేదంటారు?

Updated Date - 2023-08-15T15:27:12+05:30 IST