Home » International News
వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది.
సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.
కెనడా డిప్యూటీ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారతదేశం విడిచి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 19 అర్ధరాత్రి 12 గంటలలోపు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభకు తుపాకీతో వచ్చిన సాయుధుడిని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
ఉత్తర కొరియా- దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు దేశాలను అనుసంధానించే రోడ్లను ధ్వంసం చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది.
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డారోన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది
ఈ ప్రాంతంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించారు. దీంతోపాటు పెళ్లిళ్లు సహా అనేక కార్యక్రమాలపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.