Home » IPL Auction 2024
ఐపీఎల్ 2024కు సంబంధించిన మినీ వేలం దుబాయ్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్వీకి బంపర్ జాక్‌పాట్ తగిలింది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.8.4 కోట్లకు సొంతం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో అసలు సమీర్ రిజ్వీ ఎవరు అని.. అతడి కోసం చెన్నై లాంటి ప్రతిష్టాత్మక జట్టు కోట్లు కుమ్మరించడమేంటని చర్చించుకుంటున్నారు.
IPL Auction: ఐపీఎల్ వేలంలో ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. టాప్ క్లాస్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. యంగ్ టాలెంట్‌పై కోట్లు కుమ్మరించాయి. దీంతో కొందరు యువ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే ప్లేయర్ల శాలరీలు ఎలా ఉంటాయ్..? మ్యాచ్ ఫీజుల సంగతి ఏంటి? వేలం తర్వాత అభిమానుల్లో నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే..!
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్‌లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Shubham Dubey: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పుణ్యమా అని అనామక ఆటగాళ్లు సైతం కోటీశ్వరులైపోతున్నారు. టాలెంట్ ఉంటే చాలు వారి కుటుంబ నేపథ్యంతో పని లేకుండా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.
Mitchell Starc: ఐపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL 2024: ఐపీఎల్ 2023 వేలం ముగిసింది. మినీ వేలం అనే పేరే కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మురించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(రూ.24.75)ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL 2024: ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం దుబాయ్‌లోని కోకా కోలా ఎరీనాలో అట్టహాసంగా జరుగుతోంది. ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ.20.5 కోట్లు వెచ్చించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు.