Share News

IPL Auction: రూ.1.5 కోట్లకు హసరంగను దక్కించుకున్న సన్‌రైజర్స్.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్!

ABN , Publish Date - Dec 19 , 2023 | 04:01 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం దుబాయ్‌లోని కోకా కోలా ఎరీనాలో అట్టహాసంగా జరుగుతోంది. ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ.20.5 కోట్లు వెచ్చించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు.

IPL Auction: రూ.1.5 కోట్లకు హసరంగను దక్కించుకున్న సన్‌రైజర్స్.. కావ్య మారన్ రియాక్షన్ వైరల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL Auction) మినీ వేలం దుబాయ్‌ (Dubai)లోని కోకా కోలా ఎరీనాలో అట్టహాసంగా జరుగుతోంది. ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఏకంగా రూ.20.5 కోట్లు వెచ్చించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. కమిన్స్‌తో పాటు మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను (Travis Head) రూ.6.8 కోట్లకు దక్కించుకుంది.

ఈ వేలం కోసం సన్‌రైజర్స్ యజమాని కళానిధి మారన్ కూతురు అయిన కావ్య మారన్ (Kavya Maran) దుబాయ్ వెళ్లి వేలంలో పాల్గొన్నారు. శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ కోసం సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. అయితే సీఎస్కేను వెనక్కి నెట్టి రూ.1.5 కోట్లకు హసరంగను (Hasaranga) సన్‌రైజర్స్ దక్కించుకుంది. టీ20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్ అయిన హసరంగా తక్కువ ధరకే స్వంతమవడంతో కావ్య సంతోషం కట్టలు తెంచుకుంది. హసరంగను వేలంలో దక్కించుకోగానే కావ్య ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది (Kavya Maran's Reaction).

IPL auction 2024: పావెల్ @ రూ.7.4 కోట్లు.. స్మిత్‌ అన్‌సోల్డ్.. దుబాయ్‌లో ఐపీఎల్ 2024 వేలం!

గతంలో భారీ ధర పెట్టి కొన్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ టీమ్ వదిలించుకుంది. గతేడాది రూ. 13.5 కోట్లకు బ్రూక్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. అయితే గత సీజన్‌లో బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడిని ఈ ఏడాది వదిలించుకుంది. బ్రూక్‌ను ఈ రోజు జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు స్వంతం చేసుకుంది. కాగా, భారీ ధరకు కొన్న ప్యాట్ కమిన్స్‌ సన్‌రైజర్స్ టీమ్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

Updated Date - Dec 19 , 2023 | 04:03 PM