Home » IT Raids
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ఆదాయపు పన్ను లెక్కల్లో చూపని నగదు విలువ ఆదివారం నాటికి రూ.351 కోట్లకు చేరుకుంది. మొత్తం 176 డబ్బుల సంచులకుగాను అధికారులు ఇప్పటివరకు 140 లెక్కించారు. మరో 36 సంచులు లెక్కించాల్సి ఉంది.
ఇటీవల ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించగా.. కళ్లుచెదిరే నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా రూ.290 కోట్లకు పైగా డబ్బు పట్టుబడిందని..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో(IT Raids) నోట్ల గుట్టలు బయటపడుతన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లలోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని 'ఎక్స్' వేదికపై మోదీ శుక్రవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తన ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది.
తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు బదిలీపై ఐటీ - ఈడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల ఏకకాలంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
తెలంగాణలో ఐటీ సోదాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో ఐటీ అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్‌గా ఐటీ సోదాలు జరగ్గా.. నేడు ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో రైడ్‌కు పాల్పడింది.
Telangana Elections: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఐటీ అధికారుల ప్రవర్త సరిగా లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఐటీ అధికారులు పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో, పొంగులేటి బంధువు నంద గిరి హిల్స్‌లోని బంధువు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.