Share News

IT Rides: టాలీవుడ్ నిర్మాతల ఆస్తులను పరిశీలిస్తు్న్న ఐటీ అధికారులు..

ABN , Publish Date - Jan 23 , 2025 | 09:00 AM

సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మూడో రోజు గురువారం కూడా అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, మాంగో అధినేత రామ్, సినీ ఫైనాన్సర్లకు చెందిన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు కొనసాగుతున్నాయి.

IT Rides: టాలీవుడ్ నిర్మాతల ఆస్తులను పరిశీలిస్తు్న్న ఐటీ అధికారులు..
it Rides

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల (Tollywood Producers)పై మూడో రోజు గురువారం ఐటీ అధికారులు (IT Officials) సోదాలు (Searches) కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), నవీన్ ఎర్నేని (Naveen Erneni), డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar), మాంగో అధినేత రామ్ (Mango Head Ram), సినీ ఫైనాన్సర్లకు (Film financiers) చెందిన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది వరకు వారి ఇండ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా గురువారంతో సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ వార్త కూడా చదవండి..

గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం


సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండోరోజైన బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఇటీవల విడుదలైన చిత్రాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్‌ చేంజర్‌, వారసుడు సినిమాలకు సంబంధించిన లెక్కలపై ప్రధానంగా దృష్టి సారించారు. పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్‌ బుధవారం హైదరాబాద్‌ చేరుకోవటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయనను కలుసుకొని.. నేరుగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్‌ తీసుకున్న పారితోషికం గురించి వారు ఆరా తీసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, మైత్రి మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, యలమంచలి రవిశంకర్‌, చెర్రీ, దిల్‌ రాజుతోపాటు ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

కాగా, ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలావరకు నల్లధనం ఉంటుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారి బ్యాంకు ఖాతాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన పెట్టుబడి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తున్నపుడు పలు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. ఇటీవల విజయవంతమైన సినిమాల బ్యాలెన్స్‌షీట్లు, ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివరాల్లో కూడా భారీ వ్యత్యాసమున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సినిమా కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ రిటర్నుల్లో కూడా వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం.


భారీ కలెక్షన్లపై దృష్టి

తక్కువ పెట్టుబడితోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి వారంలోనే రూ.200 కోట్ల కలెక్షన్లు, పుష్ప 2 సినిమాకు ఇప్పటి వరకూ రూ.1850 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాటిపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. తమిళ హీరో విజయ్‌ నటి ంచిన వారసుడు సినిమాకు సంబంఽధించి దిల్‌ రాజు సంస్థ చూపించిన లెక్కలపైనా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఐటీ సోదాలు తనను ఒక్కడినే లక్ష్యంగా చేసుకొని జరగడం లేదని, సినీ రంగంలో చాలాచోట్ల జరుగుతున్నాయని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ఐటీ అధికారులు అడిగిన అన్ని వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చామని, పన్ను చెల్లింపునకు సంబంధించి తేడాలుంటే వారిచ్చే నోటీసుల ఆధారంగా వ్యవహరిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి

చంద్రబాబుతో భేటీలో బిల్ గేట్స్ రియాక్షన్..

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి, ఉడకబెట్టి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 23 , 2025 | 09:37 AM