Home » Jagan Cases
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.
జగన్ (Jagan) అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ జరపనుంది. బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.