AP Elections:పవన్ బయటపెట్టిన జగన్ అవినీతి లెక్కలు.. వైసీపీలో మరో టెన్షన్..
ABN , Publish Date - Mar 31 , 2024 | 08:05 AM
జగన్ (Jagan) అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి. వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన, బీజేపీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐదేళ్ల పాలనలో జగన్ (Jagan) అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి వాహనంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం మొదటిరోజు వైసీపీ అధినేత జగన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. బస్సు యాత్రలో జగన్ మాట్లాడుతున్న తాను పేదోడ్ని.. పేద ప్రజల మనిషిని అంటున్న వ్యాఖ్యలకు జనసేనాని కౌంటర్ ఇచ్చారు. వందల కోట్ల రూపాయిల విలువ కలిగిన కంపెనీలు ఉన్న జగన్ ఎలా పేదవాడవుతాడు.. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైసీపీ అధినేత ఎలా పేద ప్రజల మనిషి అవుతారంటూ ప్రశ్నించారు. జగన్ తన పాలనలో చేసిన అక్రమాలు, వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలను ప్రజలకు వివరించారు పవన్ కళ్యాణ్.
20వేల కోట్లు దోచుకున్న జగన్ పేదోడా?
అవినీతిపై 8 లక్షల ఫిర్యాదులు..
రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా ఫిర్యాదు చేయాలంటూ ఒక ఫోన్ నెంబర్‌ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. దాదాపు 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటిలో 2 లక్షల ఫిర్యాదులు మంత్రుల అవినీతిపై వస్తే, మరో నాలుగు లక్షల ఫిర్యాదులు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై వచ్చాయని.. ఈ ఫిర్యాదులపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అవినీతి రాజ్యమేలుతుందని, వైసీపీ నాయకులు కమీషన్లు లేకుండా ఏ పని చేయని పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.
వైసీపీలో టెన్షన్..
వైసీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలు, అరాచకాలను పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో బయటపెడుతుంటంతో వైసీపీ నేతల్లో మరో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో తాము సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నామని.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. దీంతో తమ గెలుపు కష్టమనే భావనలో కొందరు వైసీపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ జగన్ అవినీతి, అక్రమాలను లెక్కలతో బయటపెట్టడంతో పాటు.. ఓట్ల కోసం వచ్చే వైసీపీ నేతలను నిలదీయాలని ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న క్రమంలో... ప్రజలకు తాము ఎలాంటి సమాధానం చెప్పాలనే భయం వైసీపీ నేతలను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి రోజే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు చుక్కలు చూపించారనే చర్చ జరుగుతోంది.
Chandrababu: 2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా మారుస్తా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..