Home » Jayanthi
అమరావతి: తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఆయన జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని వివిఐటి విద్యార్థులు సమతా వాక్ నిర్వహించారు. గుంటూరు మస్తానయ్య దర్గా నుండి విజయవాడ కనక దుర్గ ఆలయం వరకు నడవనున్నారు. గత 14 ఏళ్లుగా దర్గా టూ దుర్గా వాక్ కొనసాగిస్తున్నారు.
రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస అని ఏపీ సీఎం చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఏళ్ల కిందటే ఆయన చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) కీలక పాత్ర పోషించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే..