Home » JDS
ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణ (Prajwal Revanna) జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఆమె తల్లి భవానీ రేవణ్ణను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna Scandal) పాస్‌పోర్టు రద్దు(Passport Seize) చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(MEA) శుక్రవారం లేఖ రాసింది.
రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే భారత్ తిరిగి వచ్చి.. పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని ప్రజ్వల్‌ను ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు, ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్ ఏ దేశంలోనైనా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరామని పేర్కొంది.
అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటుండటంతో వారికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ నిర్ణయించింది. అత్యాచార బాధితులందరికీ ఆర్థిక సాయం చేయడానికి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన అభ్యంతకర వీడియోల స్కాండల్ పై హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. త్వరలోనే నిజం నిగ్గు తేలుతుందని అన్నారు.