Share News

BJP: మరో పాదయాత్రకు ‘బీజేపీ’ కసరత్తు...

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:31 PM

ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

BJP: మరో పాదయాత్రకు ‘బీజేపీ’ కసరత్తు...

- చలో మైసూరు విజయంతో ఉత్సాహం

- వాల్మీకి కార్పొరేషన్‌ అవినీతిపై ఉత్తర కర్ణాటకలో..

బెంగళూరు: ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ముడా అక్రమాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) రాజీనామా చేయాలని, సీబీఐ ద్వారా విచారణ జరపాలని బీజేపీ - జేడీఎస్‌(BJP-JDS) సంయుక్తంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. మరో మూడు రోజుల్లో యాత్ర మైసూరు(Mysore)లో ముగుస్తుంది. ఆ వెంటనే మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

ఇదికూడా చదవండి: Chennai: చెన్నైలోని 776 ప్రాంతాల్లో ‘రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు’


వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌(Valmiki Development Corporation)లో అవినీతి జరిగిందని స్వయంగా సీఎం సిద్దరామయ్య శాసనసభలో అంగీకరించారు. ఇప్పటికే మంత్రి నాగేంద్ర(Minister Nagendra) రాజీనామా చేశారు. దీంతో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతిని నిరసిస్తూ బళ్లారిలో ర్యాలీ చేపట్టాలని భావిస్తున్నారు. బీదర్‌ నుంచి బళ్లారి లేదా, బళ్లారి నుంచి చిత్రదుర్గకు పాదయాత్ర చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలకు సమాచారం ఇచ్చి కోర్‌ కమిటీతో చర్చించి పాదయాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu) తెలిపారు.

pandu2.jpg


మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని, యాదగిరిలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌ ఆకస్మిక మృతికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపించారు. కల్యాణ కర్ణాటకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.25వేల కోట్ల బడ్జెట్‌ గ్రాంట్లను గ్యారెంటీలకు వినియోగిస్తున్నారని అన్నారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో కోట్లాది రూపాయల అవినీతితో అట్టడుగు వర్గాలకు అందాల్సిన సాయం దూరమైందన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో పాదయాత్ర ద్వారా ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తామని తెలిపారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

దికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 07 , 2024 | 01:39 PM