Former Minister: నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి..
ABN , Publish Date - Jul 17 , 2024 | 01:22 PM
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి’... అంటూ శాసనసభలో మాజీ మంత్రి, జేడీఎస్ నేత రేవణ్ణ(Former minister and JDS leader Revanna) విరుచుకుపడ్డారు. ప్రతిపక్షనేత అశోక్ వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన అవినీతి కేసును విచారిస్తున్న సిట్ అధికారుల తీరుకు, ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కేసులో సిట్ ప్రవర్తించిన విధానాన్ని పోల్చారు.
- ప్రజ్వల్ వివాదంపై శాసనసభలో మాజీ మంత్రి రేవణ్ణ
బెంగళూరు: ‘నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి’... అంటూ శాసనసభలో మాజీ మంత్రి, జేడీఎస్ నేత రేవణ్ణ(Former minister and JDS leader Revanna) విరుచుకుపడ్డారు. ప్రతిపక్షనేత అశోక్ వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన అవినీతి కేసును విచారిస్తున్న సిట్ అధికారుల తీరుకు, ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కేసులో సిట్ ప్రవర్తించిన విధానాన్ని పోల్చారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) రిజ్వాన్ అర్షద్, నారాయణస్వామి, నరేంద్రస్వామి తదితరులు అదేం చిన్న కేసా..? అంటూ మండిపడ్డారు. ఒకానొక దశలో మహిళ మర్యాద వెనక్కొస్తుందా అంటూ ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి: ఇంటి తాళాలు పగులకొట్టి 30 తులాల బంగారు చోరీ...
కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటే కట్టించవచ్చు అన్నారు. ఇదే సందర్భంలో రేవణ్ణ జోక్యం చేసుకుని తన పేరు ప్రస్తావించారని, తాను మాట్లాడాలంటూ అభ్యంతరం తెలిపారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే ఉరి తీయనీ... డీజీ ఆఫీసులో ఓ మహిళ చేత ఫిర్యాదు రాయించారని ఆరోపించారు. పోలీసు అధికారుల పట్ల అనుచితంగా మాట్లాడారంటూ అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి సభ గందరగోళమైంది.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News