Home » Jharkhand
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. దాంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారాయి. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఫలితాలు పునరావృతం కాకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు(heat wave) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా 210 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.
ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్ ఆలమ్ పర్సనల్ సెక్రటరీ(పీఎస్) సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్ ఆలమ్‌ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.
మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.
జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.
గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు.