Assembly Elections: గెలుపు కోసం పావులు కదుపుతున్న బీజేపీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:22 PM
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. దాంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారాయి. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఫలితాలు పునరావృతం కాకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
న్యూఢిల్లీ, జూన్ 17: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. దాంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారాయి. అయితే భవిష్యత్తులో ఈ తరహా ఫలితాలు పునరావృతం కాకుండా బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.
మరోవైపు దేశంలోని నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు మరికొద్ది నెలల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఆ యా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించు కోందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఆ క్రమంలో ఆ యా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లతోపాటు కో ఇన్‌చార్జ్‌ను నియమించింది. అందుకు సంబంధించిన నియమకాలను న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది.
Also Read: Reasi Terror Attack: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్‌ను నియమించింది. అలాగే ఆ రాష్ట్ర ఎన్నికల కో - ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నియమించింది. ఇక ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నియమించింది. ఆ రాష్ట్ర ఎలక్షన్ కో - ఇన్‌చార్జ్‌గా అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మను నియమించింది.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించింది. హర్యానా ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ధర్మేంద్ర ప్రదాన్‌ను నియమించింది. హర్యానా ఎన్నికల కో- ఇన్‌చార్జ్‌గా త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్‌ను నియమించింది.
Also Read: Bengal Train Accident: ‘కాంచన్ జంఘా’పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
మరోవైపు మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది జరగనున్నాయి. కానీ జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Latest National News and Telugu States News