Home » KA Paul
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అందరూ నమ్ముతున్నారని అన్నారు. ఇదే సమయంలో.. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుని ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేకసార్లు మీడియా సమావేశాల్లో చెప్పానని, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలే చేసిందని అన్నారు.
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే సమయంలో.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు.
విశాఖ: ‘నరేంద్రమోదీతో యుద్ధం-మన విశాఖ సిద్ధం’ అని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నమ్మక ద్రోహంచేస్తున్నారని...ఆఖరికి తల్లి, చెల్లిని మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కేఏ.పాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. రేవంత్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితి మారుతోందన్నారు.
KA Paul: ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాడేపల్లి వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు కేఏ పాల్‌కు తెలిపారు. అంతేకాకుండా క్యాంప్ కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. అనంతరం జగన్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ వచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయనను క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ వేచి చూస్తున్నారు.
Andhrapradesh: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీ ని అమ్మేశారని విమర్శించారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు.
Viral Video: వంగవీటి మోహన్‌రంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు కావడంతో సోమవారం నాడు విజయవాడలో కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో కేఏ పాల్ ప్రసంగిస్తుంటే..
జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన మా పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన , ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు’’ అని కేఏ పాల్ తెలిపారు.