KA Paul: ఇదే నా శాపం.. మీడియా సంస్థలకు కేఏ పాల్ హెచ్చరిక
ABN , Publish Date - Mar 23 , 2024 | 11:39 AM
Telangana: నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి తనను చాలా సార్లు కలిశారని.. తెలంగాణ వాటర్ మినిస్టర్‌ను మార్చమని చెప్పానని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెపుతున్నారని... రైతుబందు డబ్బులు ఐదు వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు.
నల్గొండ, మార్చి 23: నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ (Prajashanti Chief KA Paul) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వచ్చి తనను చాలా సార్లు కలిశారని.. తెలంగాణ (Telangana) వాటర్ మినిస్టర్‌ను మార్చమని చెప్పానని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి (Minister Komatireddy venkatreddy) చాలా చెపుతున్నారని... రైతుబందు డబ్బులు ఐదు వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. అధికార దాహంతో బీజేపీ నేతలు (BJP Leaders) డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ భూ స్థాపీతం అయ్యిందని.. బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యిందన్నారు. రూ.25 లక్షల కోట్లు పెద్దలకు దోచి పెట్టారని ఆరోపించారు. ‘‘నా మాటలు అన్ని మీడియా సంస్థలు లైవ్ ఇవ్వాలి. నా మాటలను చూపించక పోతే మీడియా సంస్థలు అన్ని ఇబ్బందులు పడుతాయి. ఇదే నా శాపం.. మీడియా సంస్థలకు నా హెచ్చరిక’’ అంటూ మీడియా సంస్థలకు పాల్ హెచ్చరికలు జారీ చేశారు.
Arvinad Kejriwal: బిగ్‌బాస్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుఖేశ్ దిమ్మతిరిగే లేఖ..
నల్గొండ లోక్‌సభ బరిలో ఉంటాం....
శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే కేసీఆర్‌ను చిత్తు గా ఓడించానన్నారు. మెగా కృష్ణారెడ్డి తనను చంపగలిగాడా?... రాజశేఖర్ రెడ్డి తనను చంపాలని ముక్కలు అయిపోయారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గురువు చంద్రబాబు చెప్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తామన్నారు. ఏపీలో రాజకీయ నాయకులందరిని డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో డ్రగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపాలన్నారు. కవిత జైలుకు వెళుతుందని ముందే చెప్పానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత మందిని అరెస్ట్ చేశారని నిలదీశారు. వెయ్యి కోట్లకు మెగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి అమ్ముడు పోయారన్నారు. నల్గొండ లోక్‌సభకు ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉంటుందని కేఏపాల్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు ఎందుకు..?
Chennai: త్వరలో ప్రధాని మోదీ సహా 18మంది కేంద్ర మంత్రుల ప్రచారం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..