Home » Kadiyam Kavya
వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాకారమైందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నెరవేరిందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కడియం శ్రీహరి గుట్టును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య విప్పారు. గతంలో కడియం శ్రీహరి డొక్కు స్కూటర్‌పై తిరిగే వారని గుర్తు చేశారు. అలాంటి కడియం శ్రీహరికి ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. ఆపై మంత్రి సైతం చేశారని వివరించారు.
డాక్టర్లపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో జూనియర్ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (MP Kadiam Kavya) పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ డాక్టర్ కడియం కావ్య చర్చలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. బుధవారం హనుమకొండలో తాడికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి నకిలీ దళితుడని ఆరోపించారు.
కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఖిలా వరంగల్‌లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. వాకర్స్, కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.