Telangana Politics: శుద్ధపూసలా మాట్లాడుతున్న కడియం శ్రీహరి
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:15 PM
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కడియం శ్రీహరి గుట్టును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య విప్పారు. గతంలో కడియం శ్రీహరి డొక్కు స్కూటర్‌పై తిరిగే వారని గుర్తు చేశారు. అలాంటి కడియం శ్రీహరికి ఎన్టీఆర్ పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. ఆపై మంత్రి సైతం చేశారని వివరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 27: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. స్థాయిని మరిచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ లపై కడియం శ్రీహరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.
Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు
కడియం శ్రీహరి శుద్ధపూసలా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కడియం శ్రీహరి రాజకీయ వ్యభిచారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే పదవితోపాటు డిప్యూటీ స్పీకర్ పదవికి సైతం కేసీఆర్ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ స్థాపించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకే కాదు.. కేంద్ర మంత్రి పదవికి సైతం కేసీఆర్ రాజీనామా చేశారన్నారు. కడియం శ్రీహరి ముందు బెంచి నుండి వెనుక బెంచిలో కూర్చునే స్థాయికి వచ్చారన్నారు.
Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?
అలాంటి కడియం శ్రీహరి.. తనకు ఫిరాయింపు చట్టాలపై గౌరవం ఉందని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. 1994 లో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే అయ్యే నాటికి డొక్కు స్కూటర్ మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. అలాంటి కడియం శ్రీహరిని ఎన్టీఆర్ పిలిచి.. ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశారన్నారు. అయితే కడియం శ్రీహరి.. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో జత కట్టారని పేర్కొన్నారు.
Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..
సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా చేసి కడియం కుబేరుడు స్థాయికి చేరారన్నారు. మంత్రిగా కడియం శ్రీహరి 8 శాతం కమీషన్ తీసుకున్నారని గుర్తు చేశారు. శ్రీహరి కుమార్తె ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ హాంకాంగ్, సింగపూర్‌లో సైతం భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఒక్కో డీఈఓ పోస్టును రూ. 2 కోట్లకు కడియం శ్రీహరి అమ్ముకున్నారని తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఒక్కో హైడల్ ప్రాజెక్టులో కడియం రూ. ఐదు కోట్లు తీసుకున్నారు చెప్పారు. ఇక కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పని చేశారని తెలిపారు. కడియం శ్రీహరికి దళిత దొరగా పేరు పెట్టారని గుర్తు చేశారు.
1999లో ఒక్కో ఓటుకు కడియం శ్రీహరి రూ. 500 ఇచ్చి తనపై గెలిచారన్నారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి వేరే పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కడియం శ్రీహరిని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరానని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య గుర్తు చేసుకున్నారు.
కడియం శ్రీహరి పదవుల్లో ఉండి పార్టీలు మారారన్నారు. తనపై లేని పోనివి చెప్పి కడియం శ్రీహరి తన డిప్యూటీ సీఎం పదవిని లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 12 సంవత్సరాలుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశానన్నారు. కేసీఆర్‌ను కడియం శ్రీహరి నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీహరి బ్లాక్ మెయిల్ చేసి తన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇప్పించుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఎంపీ టిక్కెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి పార్టీ మారారన్నారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశాడని ప్రశ్నించారు. కడియం శ్రీహరిని కేసీఆర్ ఎంపీ, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారన్నారు. కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడగా అభివర్ణించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు టెక్స్‌టైల్ పార్క్, డిగ్రీ కళాశాల రాకుండా చేశారని కడియంపై మండిపడ్డారు.
అలాగే స్టేషన్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ కాకుండా అడ్డుకున్నారన్నారు. కడియం శ్రీహరి ఎప్పుడు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాఫ్ అయిందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని చెప్పారు. రేవంత్‌రెడ్డికి కడియం శ్రీహరి వంత పాడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కడియం శ్రీహరి గతంలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గుర్తు చేశారు.
For Telangana News And Telugu News