Share News

Thatikonda Rajaiah: కడియం శ్రీహరి నకిలీ దళితుడు

ABN , Publish Date - May 08 , 2024 | 05:59 PM

ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. బుధవారం హనుమకొండలో తాడికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి నకిలీ దళితుడని ఆరోపించారు.

Thatikonda Rajaiah: కడియం శ్రీహరి నకిలీ దళితుడు

హనుమకొండ, మే 08: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. బుధవారం హనుమకొండలో తాడికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి నకిలీ దళితుడని ఆరోపించారు.

అలాగే ఆయన కుమార్తె కడియం కావ్య నకిలీ మతస్థురాలన్నారు. శ్రీహరిపై కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. శ్రీహరిని ఓన్ చేసుకునేందుకు ఆ పార్టీలో ఎవరు ముందుకు రావడం లేదని చెప్పారు. అలాగే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఈ నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి కల్యాణ లక్ష్మీ పథకం వర్తింప చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.


ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలుపొందారు. అనంతరం ఆయనతోపాటు ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది.

అయితే తాను ఎన్నికల బరిలో దిగనంటూ.. కారు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ క్రమంలో తాను ఎందుకు ఎన్నికల బరిలో నిలవడం లేదో కారణాలు సైతం ఆ లేఖలో పొందు పరిచింది. అనంతరం కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 06:00 PM