Home » Karnataka Elections 2023
కర్ణాటక (Karnataka) ‘హస్త’గతమైంది..! ఆహా, ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది..! కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచీ కాంగ్రెస్ (Congress) హవా కొనసాగుతూనే ఉంది..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక్కసారిగా భావోగ్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. కర్ణాటకలో విజయాన్ని సాధించి ఇస్తానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషన్‌కు గురయ్యారు.
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యతల పరంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ చేరుకోవడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు వెల్లువెత్తాయి. కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేయగా, పలువురు కార్యకర్తలు హనుమంతుడి వేషధారణలతో 'బజ్‌రంగ్ బలీ' నినాదాలు చేశారు.''బజ్‌రంగ్ బలి.. కాంగ్రెస్‌తో ఉన్నారు. బీజేపీకి ఆయన జరిమానా వేశారు'' అని హనుమాన్ వేషధారణలో ఉన్న ఒక కార్యకర్త కమలం పార్టీపై విసుర్లు విసిరారు.
కర్ణాటకలో (Karnataka) ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అక్షరాలా నిజమవుతున్నాయ్.. ఒకట్రెండు తప్ప మిగిలిన సర్వే సంస్థలన్నీ కర్ణాటక కాంగ్రెస్‌దే (Congress) అని తేల్చి చెప్పేశాయి. అనుకున్నట్లుగానే..
బెంగళూరు: కర్ణాటకలో ఓవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ హవా సాగిస్తూ, మెజారిటీ మార్క్‌కు చేరువవుతుండటంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఎక్కడా తమ నేతలు పక్క చూపులు చూపకుండా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా చూసేందుకు జాగ్రత్త పడుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని తాము ఆశిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తోంది..
బెంగళూరు: కర్ణాటక ఎన్నిక పోలింగ్‌లో మొదటి రెండు గంటలు నువ్వా-నేనా అనే రీతిలో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడినప్పటికీ 10 గంటల ప్రాంతానికి కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌కు (ఆధిక్యాలపరంగా) చేరువలోకి వచ్చింది. మెజారిటీకి 112 స్థానాలు గెలవాల్సి ఉండగా, 110 స్థానాలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీజేపీ 71 స్థానాల్లో లీడింగ్ కొనసాగిస్తోంది. జేడీఎస్ 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని, దీనికి కారణం బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు (Karnataka assembly election results) వెలువడిన తర్వాత జేడీఎస్ పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్